శ్రీ‌కృష్ణ ప‌ర‌మాత్ముడి జీవితం చీక‌టి వెలుగుల సారాంశం: బేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 16 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శ్రీకృష్ణ జన్మాష్టమిని భ‌క్తులు ఘ‌నంగా జ‌రుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ప‌లు చోట్ల జ‌రిగిన కృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఇస్నాపూర్ యాదవ మహాసభ యాదవ సంఘం ఆహ్వానం మేరకు ఇస్నాపూర్ ముఖ్య కార్యక్రమానికి హాజరై స్వామి వారిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అలాగే బీరంగూడ శివాలయం వద్ద‌ జరిగిన శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలకు పాములేటి యాదవ్ హరిబాబు యాదవ్ ఆహ్వానం మేరకు పాల్గొని శ్రీకృష్ణుని విగ్రహానికి పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా భేరి రామచంద్ర యాద‌వ్ మాట్లాడుతూ శ్రీ‌కృష్ణ ప‌ర‌మాత్ముడి జీవితం చీక‌టి వెలుగుల సారాంశ‌మ‌ని అన్నారు. శ్రీ‌కృష్ణుడు మ‌న‌కు నిత్యం ఎదుర‌య్యే ఎన్నో స‌మ‌స్య‌ల‌కు భ‌గ‌వ‌ద్గీత ద్వారా ప‌రిష్కారం చూపాడ‌ని అన్నారు. శ్రీ‌కృష్ణుడి జీవితం ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల‌కు చ‌క్క‌ని మార్గం చూపెడుతుంద‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మాల‌లో పటాన్‌చెరు మండల అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, సత్యనారాయణ యాదవ్, ఆర్కే సాయన్న ముదిరాజ్, చిన్న శ్రీశైలం యాదవ్, బసవరాజు యాదవ్, సిపిఎం సీనియర్ నాయకుడు వీర్ల ప్రకాష్ రాజ్ యాదవ్, గ్యాస్ వెంకటేష్ యాదవ్, పాములేటి యాదవ్, డప్పు కొట్టు హరిబాబు యాదవ్, సాఫ్ట్‌వేర్ వెంకటేష్ యాదవ్, జై గోకుల కృష్ణ యాదవ సేవా సంఘం స‌భ్యులు, జెట్టి రామ్ ప్రసాద్, రాములు యాదవ్‌, సుధాకర్ యాదవ్‌, బాలు యాదవ్‌, లక్ష్మణ్ యాదవ్‌, శ్రీను యాదవ్‌, కోటేశ్వర్ యాదవ్‌, వెంకటేశ్ యాదవ్‌, అజయ్ యాదవ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here