శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఇజ్జత్ నగర్‌లోని సిపిఐ మండల పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నాయకుడు కె.చందుయాదవ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఐ రామకృష్ణ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా ఇప్పటికీ సొంత ఇంటి కోసం, నాణ్యమైన చదువుల కోసం, ఉద్యోగాల కోసం, నాణ్యత కలిగిన వైద్యం కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. పూర్తి స్వాతంత్ర్య రాజ్యాంగం ఫలాలు ప్రజలకు అందాలన్నారు. పాలకులు ఎవరు వచ్చి పోయినా రాజ్యాంగం ఇచ్చిన హక్కులను అమలు చేయడంలో విఫలం అవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సిపిఐ సహాయ కార్యదర్శి కె చందు యాదవ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు కే సుధాకర్, ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు తుపాకుల రాములు, జిల్లా భవన నిర్మాణ అధ్యక్షుడు కాసిం, ఇజ్జత్ నగర్ శాఖ కార్యదర్శి ఎం వెంకటేష్, హఫీజ్‌పేట కార్యదర్శి బి.నారాయణ, రఘు, భాస్కర్, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి కే శివకుమార్, ఏఐఎస్ మండల అధ్యక్షుడు టి నితీష్, ఎస్ నరసమ్మ, డిహెచ్పిఎస్ కార్యదర్శి ఎస్ కొండలయ్య, దేవేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






