శేరిలింగంపల్లి, ఆగస్టు 14 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న యాచకులను ఆశ్రమానికి తరలిచేందుకు స్థానిక పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. యాచకుల వల్ల ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకూడదనే ఉద్దేశంతో స్థానికంగా ఉన్న 19 మందిని రామోజీ ఫిలిం సిటీ సమీపంలో ఉన్న అబ్దుల్లాపూర్మెట్ ఆలేటి ఆశ్రమానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.






