మయూరి నగర్ కాలనీ అభివృద్ధికి కృషి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని ఆయ‌న నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను ఆరెకపూడి గాంధీ అభినదించారు. అనంతరం ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ మయూరి నగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాన‌ని అన్నారు. మయూరి నగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని అన్నారు. ఏ చిన్న సమస్య అయినా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కలిదిండి వెంకట రామరాజు, ఉపాధ్యక్షురాలు బొడ్డు రాధాదేవి, ఉపాధ్యక్షుడు కొండపల్లి హరికృష్ణ , జనరల్ సెక్రటరీ మండెపూడి కిషోర్ కుమార్, జాయింట్ సెక్రటరీ గజ్జల వెంకట రమణా రెడ్డి, జాయింట్ సెక్రటరీ మూరకొండ గోపాల్ రెడ్డి, కోశాధికారి మొల్లేటి నాగరాజు, కార్యనిర్వాహక సభ్యులు ఎన్.అఖిల, ఎం.వర లక్ష్మి, ఫ్రాన్సిస్ సౌ రెడ్డి యెన్నం, గుమ్మడి వేణు గోపాల్ రావు, కృష్ణ కుమార్ పాటిబండ, గంగిశెట్టి సచిన్ కుమార్ , కాసుల వెంకట నరసయ్య , సారెడ్డి అమరనాథ్ రెడ్డి, మహమ్మద్ జానీబాషా షేక్, జి. రఘు రామరాజు, ఎన్ నాగరాజు, NVV కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here