శేరిలింగంపల్లి, ఆగస్టు 10 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గోపి నగర్ , బాపునగర్ ప్రాంతంలో శ్రావణ మాసం బోనాల పండుగ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ యూత్ మాజీ వైస్ ప్రెసిడెంట్ మారబోయిన రవి యాదవ్, స్థానిక భక్తులతో కలిసి శ్రీ పోచమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రవి యాదవ్ మాట్లాడుతూ తమ గ్రామ ప్రజలందరికీ పోచమ్మ తల్లి అనుగ్రహంతో ఆరోగ్యం, సంపద, సుఖశాంతులు కలిగించాలని కోరుకున్నారు. మన సంప్రదాయాలు, సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకుంటూ అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలని పోచమ్మ తల్లిని వేడుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో కేఎన్ రాములు, రవి కుమార్, గడ్డం శ్రీనివాస్, ప్రభాకర్ గౌడ్, శ్రీకాంత్ యాదవ్, వెంకట్ రెడ్డి, మల్లేష్ ముదిరాజ్, బుయ్య మలేష్ గౌడ్, గంగాధర్ గౌడ్, కొండకల్ శ్రీనివాస్, నవీన్ గౌడ్, మున్నా, పవన్ కుమార్, దివ్య, సాయి నందన్ ముదిరాజ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.






