శేరిలింగంపల్లి, ఆగస్టు 10 (నమస్తే శేరిలింగంపల్లి): గెలవటం కంటే గెలుపు కోసం చేసే ప్రయత్నం గొప్పది, క్రీడల్లో పరాజయం ఉండచ్చు కానీ క్రీడాస్పూర్తిలో కాదు అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. మనం ఈ పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో పోటీ పడాలి , ఓడిపోతామని భయపడి ఆపకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలి అని అన్నారు. యువత క్రీడలోనే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు వంశీరెడ్డి ఆధ్వర్యంలో జయనగర్ కాలనీ లోని AMY SPORTS ARENA కాంప్లెక్స్ లో నిర్వహిస్తున్న NVR బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రవికుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఆటలు ఆడటం వలన శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారని, ఆటల్లో గెలవటం కంటే గెలుపు కోసం చేసే ప్రయత్నం గొప్పదనీ, క్రీడల్లో పరాజయం ఉండచ్చు కానీ క్రీడాస్పూర్తిలో ఉండదన్నారు, యువత క్రీడలోనే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలన్నారు. యువత ఈ పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో పోటీ పడాలని, ఓడిపోతామని భయపడి ఆపకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలన్నారు. యువతకు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న వంశీరెడ్డికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్లు శ్రీహరి యాదవ్, గోపాల్ రావు, నర్సింగ్ యాదవ్ , నరసింహ చారి, భాస్కర్ గౌడ్, వీరు యాదవ్, డివిజన్ ప్రధాన కార్యదర్శులు రేపన్ రాజు, వేణు నాగేందర్ రెడ్డి, లక్ష్మణ్ , విష్ణు, ఆంజనేయులు యాదవ్, భాస్కర్ గౌడ్, సాయి తదితరులు పాల్గొన్నారు.






