శ్రీ స్వర సిద్ధి శ్రీనివాసునికి శ్రీవాణి శ్రీనివాస్ బృందం స్వరాలాపన

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అన్నమయ్యపురంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభా రాజు ఆధ్వర్యంలో జరుగుతున్న నిత్య కార్యక్రమాలలో భాగంగా అన్నదాన ప్రసాద వితరణ జరుగగా అనంత‌రం అన్నమ స్వరార్చన చేశారు. తొలుత విష్ణు సహస్రనామ స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, అన్నమయ్య అష్టోత్తరం, గురు స్తుతి నిర్వహించారు. తదుపరి శ్రీవాణి మ్యూజిక్ అకాడమీ సంస్థ గురువు వుటుకూరి శ్రీనివాస్, శిష్యులు వి. కవిత, ఎం. రామలక్ష్మి, సి. హెచ్. సృజన, బి. ప్రసన్న, జి. మహిమ, టి. కావ్య, బి. నివేదిత, బి. వైష్ణవి, ఎస్. సృజన సంయుక్తంగా అంతయు నీవే, అన్ని మంత్రములు, షోడశ కళానిధికి, ఎక్కడి మానుష జన్మము, అణురేణు, వచ్చెను అలమేలు మంగ, కంటి శుక్రవారము, ఆకటి వేళల, ఆడరో పాడరో, వాడల వాడల, నానాటి బ్రతుకు, జయ మంగళం అనే చక్కని కీర్తనలకు తమ మధుర స్వరాలను జోడించి శ్రీ స్వరసిధ్ధి వేంకటేశ్వర స్వామి వారికి సభక్తి పూర్వకంగా అన్నమ స్వరార్చనను అందించారు. తదనంతరం క‌ళాకారులకు సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్, సంస్థ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభా రాజు జ్ఞాపికను అందించారు. చివరిగా శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతులు అందించి విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here