పారిశుద్ధ్య కార్మికుల సేవ‌లు మ‌రువ‌లేనివి: జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 8 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవ‌లను మ‌రిచిపోలేమ‌ని శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ అన్నారు. మాదాపూర్ వార్డు కార్యాల‌యంలో మాన్ సూన్ స్పెష‌ల్ డ్రైవ్‌లో భాగంగా పారిశుద్ధ్య కార్మికుల‌కు సేఫ్టీ హెల్త్ కిట్స్‌ను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా సేఫ్టీ హెల్త్ కిట్స్‌ను ధ‌రించాల‌ని సూచించారు. దీని వల్ల ఆరోగ్య స‌మ‌స్య‌లు రాకుండా నివారించ‌వ‌చ్చ‌న్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ప్ర‌తి ఒక్క‌రూ చేయూత‌ను అందించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌భుత్వం వారి సంక్షేమం కోసం కృషి చేస్తుంద‌న్నారు. వారికి కావ‌ల్సిన స‌దుపాయాల‌ను క‌ల్పిస్తుంద‌ని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here