శేరిలింగంపల్లి, ఆగస్టు 3 (నమస్తే శేరిలింగంపల్లి): మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మియాపూర్ డివిజన్ నడిగడ్డ తాండలో గడిచిన 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి , సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్తూ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా తాండలో మొక్కలు నాటే కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు , నియోజకవర్గ ఇంచార్జ్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. డివిజన్ అధ్యక్షుడు లక్ష్మణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని ఉద్దేశించి రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గడిచిన 11 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇండ్ల నిర్మాణం, రైతులకు ఆర్థిక సహాయాలను అందించిందన్నారు. రహదారుల నిర్మాణం, విద్యుత్ సరఫరా మెరుగుదల, రైల్వే అభివృద్ధి , అటల్ పెన్షన్ యోజన , ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా , ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి , బేటి బచావో బేటి పడావో , సుకన్య సమృద్ధి యోజన ,ఆయుష్మాన్ భారత్ వంటి మౌలిక సదుపాయాల గురించి ప్రజలందరూ అవగాహన చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలు , నాయకులను కోరుతున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్రరావు, బుచ్చిరెడ్డి, నాగులు గౌడ్, మణి భూషణ్, లక్ష్మణ్, పట్టాభిరామ్, గణేష్, మనోహర్, చందు, రఘు, శివారెడ్డి ,శ్రీనివాస్, సురేష్, ప్రభాకర్ , రెడ్డమ్మ, సుగుణ పాల్గొన్నారు.






