దత్త సాయి నగర్ కాలనీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంపల్లి, జూలై 29 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని దత్త సాయి నగర్ కాలనీలో నెల‌కొన్న‌ పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి పలు శాఖల సంబంధిత అధికారులు, కాలనీ వాసులు, స్థానిక నాయకులతో కలసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేశారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ దత్త సాయి నగర్ కాలనీలో కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కాలనీలో పలు సమస్యలు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి పలు శాఖల సంబంధిత అధికారులతో కలసి పాదయాత్ర చేయడం జరిగింద‌ని, దత్త సాయి నగర్ కాలనీలో తలెత్తిన డ్రైనేజీ సమస్యలను స్వయంగా పర్యటించి పరిశీలించడం జరిగింద‌ని అన్నారు. అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించడం జరిగిందని, దత్త సాయి నగర్ కాలనీలో మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని, దత్త సాయి నగర్ కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ డ్రైనేజి, మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి పలు శాఖల సంబంధిత అధికారులు, దత్త సాయి నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు, రవికృష్ణ, మారుతి, ఎంవి రమణ, సంగారెడ్డి, రామారెడ్డి, ఫణి, చౌదరి, రాంబాబు, నవీన్, రంగరాజు, సత్యనారాయణ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here