చందాన‌గ‌ర్ సాయిబాబా ఆలయంలో చోరీ

శేరిలింగంప‌ల్లి, జూలై 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సాయిబాబా ఆల‌యంలో హుండీ సొత్తు చోరీకి గురైన సంఘ‌ట‌న చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. చందాన‌గ‌ర్‌లోని హుడా కాల‌నీ ఫేజ్ 2లో ఉన్న సాయిబాబా ఆల‌యాన్ని జూలై 24వ తేదీన రాత్రి 10.30 గంట‌ల‌కు య‌థావిధిగా మూసివేశారు. జూలై 25వ తేదీన తెల్ల‌వారుజామున 4 గంట‌ల స‌మ‌యంలో ఆల‌యానికి చెందిన ఉత్త‌రం వైపు ఉన్న గ్రిల్ డోర్ ప‌గ‌ల‌గొట్టి ఉండ‌డాన్ని వాచ్‌మెన్ నాగేశ్వ‌ర్ రావు ఆల‌య క‌మిటీ సభ్యుల‌కు తెలియ‌జేశాడు. దీంతో వారు వ‌చ్చి చూడ‌గా ఆల‌యంలో రెండు చోట్ల ఉన్న హుండీల్లో మొత్తం రూ.18వేల న‌గ‌దు చోరీకి గురైన‌ట్లు గుర్తించారు. సెల‌వులో ఉన్న మ‌రో వాచ్ మెన్ శ్రీ‌ను గ‌ది ఆల‌య ప్రాంగణంలోనే ఉండ‌గా అత‌ని గ‌ది తాళం చెవి ప‌గ‌ల‌గొట్టి ఉండ‌డాన్ని గ‌మ‌నించారు. అత‌ని గ‌దిలోనూ సొత్తు చోరీకి గురైంద‌ని తెలిపారు. అత‌ని గ‌దిలో 20 గ్రాముల బ‌రువు ఉన్న చెవి దుద్దులు, చెయిన్‌, కొంత న‌గ‌దు చోరీ అయిన‌ట్లు గుర్తించారు. ఈ మేర‌కు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా వారు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here