గుర్తు తెలియ‌ని వ్య‌క్తి చికిత్స పొందుతూ మృతి

శేరిలింగంప‌ల్లి, జూలై 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి తీవ్ర అనారోగ్యం పాలై హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. చందాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్ వ‌ద్ద ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి అప‌స్మార‌క స్థితిలో ప‌డి ఉన్నాడ‌న్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ఆ వ్య‌క్తిని చికిత్స నిమిత్తం న‌గ‌రంలోని గాంధీ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో చికిత్స పొందుతూ అత‌ను మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుని వ‌య‌స్సు 45 నుంచి 50 ఏళ్లు ఉంటుంద‌ని, ఎవ‌రైనా గుర్తు ప‌ట్ట‌ద‌లిస్తే చందాన‌గ‌ర్ పోలీసుల‌ను 9490617118, 8712568201 ఫోన్ నంబ‌ర్ల‌లో సంప్ర‌దిచాల‌ని సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here