శేరిలింగంపల్లి, జూలై 21 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలో స్థానిక నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పోతురాజుల నృత్యాలు, శివసత్తుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, సినీ నటుడు మంచు మనోజ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి ఇన్‌చార్జి, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, నాయకుడు మిరియాల రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.






