శేరిలింగంపల్లి, జూలై 15 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం కు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శాలువాతో సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రెసిడెంట్లు సాయిలు నాయి, సురేష్ నాయి , ఉపాధ్యక్షులు పరుశురాం నాయి, జనరల్ సెక్రెటరీ రవీందర్ నాయి, ట్రెజరర్ శేఖర్, కార్యవర్గ సభ్యులు, కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.






