రాయదుర్గంలో ఇఫ్తార్ విందు

శేరిలింగంప‌ల్లి, మార్చి 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రంజాన్ మాసంను పురస్కరించుకుని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంలో సీనియర్ నాయకుడు సల్లావుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దవాత్- ఏ – ఇఫ్తార్ విందు కార్యక్రమంలో సీనియర్ నాయకుడు గణేష్ ముదిరాజుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణకు ప్రత్యేకమైన గంగా జమునా తెహజీబ్ మరింతగా పరిఢవిల్లాలని అన్నారు. రంజాన్ పండుగ ప్రజా జీవితాల్లో సుఖ సంతోషాలను అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గణేష్ ముదిరాజ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సల్లావుద్దీన్, ఇమ్రాన్, కార్యకర్తలు, ముస్లింలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here