శేరిలింగంపల్లి, మార్చి 28 (నమస్తే శేరిలింగంపల్లి): నీటి వృథా అరికట్టేందుకు ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలని నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా జలమండలి హఫీజ్ పేట్ డివిజన్ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల పునరుద్ధరణ ఇంకుడు గుంతల పై అవగాహన కార్యక్రమాలని హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డ్ జలమండలి ఆధ్వర్యంలో పది రోజులపాటు అవగాహన కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ కాలనీలో అవగాహన ర్యాలీ, ఇంటింటి ప్రచారాన్ని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలనీ ప్రెసిడెంట్ రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జల సంరక్షణే మన సంరక్షణ అని అన్నారు. భూగర్భ జలాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన అందరి పైన ఉందని, ప్రతి ఒక్కరు కూడా నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కే నరసింహ యాదవ్, కాలనీ వైస్ ప్రెసిడెంట్ రాయుడు, యూత్ ప్రెసిడెంట్ డీజే భవన్, మణికంఠ, నరేష్ నాయక్, శంకర్ మార్వాడి, లక్ష్మణ్ నాయక్, వేణు మాధవ్, మహిళలు లక్ష్మమ్మ, జయమ్మ, కృష్ణవేణి, ఇందిరా బాయ్, వాటర్ బోర్డ్ సిబ్బంది, ప్రజాహిత సభ్యులు పవన్ కుమార్, ఆదర్శ్ , క్రాంతి, ఎన్జీవో జయశంకర్ పాల్గొన్నారు.