- నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గల్లంతు
- గ్రేటర్ ఎన్నికల అన్ని పార్టీలకు పెద్ద జలక్
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ ఎన్నికల వేళ శేరిలింగంపల్లి రాజకీయాల్లో సంచలనం కలిగించే సంఘటనలు చోటు చేసుకొనున్నాయి. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గల్లంతు అయ్యే పరిస్థితులు నెలకొననున్నాయి. స్థానికంగా పార్టీని నడిపిస్తున్న మాజీ శాసనసభ్యులు ఎం.భిక్షపతి యాదవ్, ఆయన తనయుడు, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీగా వ్యవహరిస్తున్న రవికుమార్ యాదవ్‌లు బిజెపి తీర్థం పుచ్చుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి నిజామబాద్ ఎంపి ధర్మపురి అరవింద్, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణలు భిక్షపతి యాదవ్‌ను తమ పార్టీలోకి తీసుకువచ్చేందుకు మంత్రాంగం నడుపగా వారి ప్రయత్నాలు సఫలమైనట్లు తెలుస్తోంది. వీరి చేరికకు బిజెపి అధిష్టానం నుండి సైతం గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. బుదవారం భిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్‌లతో పాటు పలువురు పార్టీ ప్రముఖులు బిజెపి కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తుంది.

ఒకవైపు గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగులనుంది. పార్టీ శ్రేణులతో సహా భిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్‌లు పార్టీ ఫిరాయిస్తే శేరిలింగంపల్లి రాజకీయాల్లో ప్రకంపణలు చోటు చేసుకోనునే అవకాశాలున్నాయి. నియోజకవర్గంలోని కాంగ్రెస్‌పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నేతలు ఆ పార్టీని వీడితే, ప్రత్యామ్నాయం లేకపోవడంతో పార్టీ శ్రేణులు సైతం వారి వెంటే వెళ్లే అవకాశం ఉంటుంది. వీరి ఫిరాయింతో శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఖాలీ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.






We always respect Bikshapathi Sir and Ravi Anna.. that would be a great decision by them ..