
శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ తన పదవి తో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడికి లేఖ ద్వారా తన రాజీనామాను పంపించారు. తన చిన్ననాటి నుండి తండ్రి భిక్షపతి యాదవ్ ద్వారా ప్రేరణ పొంది రాజకీయాల్లోకి వచ్చానని, దశాబ్దాలుగా భిక్షపతి యాదవ్ నియోజకవర్గ ప్రజలకు అందించిన సేవలు తనకు స్ఫూర్తిగా నిలిచాయని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు సేవాలందిస్తూ వారి హక్కుల కోసం పోరాడటమే తన లక్ష్యమని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో తాను అనుకున్నది సాధించలేననే భావన తో పార్టీని వీడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్ర కాంగ్రెస్ లో సరైన నాయకత్వం కరువైందని, ఫలితంగానే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించడం లేదన్నారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. ఇంతకాలంగా తనకు మద్దతుగా నిలిచిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు రవికుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.
Ravikumar yadhav annki evali corperter site ravali pls
మంచి నిర్ణయం