శేరిలింగంపల్లి, డిసెంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన తొలి ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, పర్యాటక ,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ డి.పటేల్ (దాజీ) లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ తొలి ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, శ్వాస మీద ధ్యాసే ధ్యానం అని, ధ్యాన్యం మీలోని శక్తిని మేలుకొల్పుతుంది. ధ్యానం మానసిక ప్రశాంతతనే కాదు శారీరక ఆరోగ్యాన్ని అందిస్తుంది . ప్రతి ఒక్కరు ప్రతి రోజు కాసేపు ధ్యానం చేయండి ఆరోగ్యం గా ఉండండి అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నరేందర్ బల్లా తదితరులు పాల్గొన్నారు.