శేరిలింగంపల్లి, నవంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): ముఖ్యమంత్రి సహాయనిది (CMRF) ద్వారా మంజూరు అయిన రూ. 24,60,000 CMRF చెక్కులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా 60 మంది లబ్ధిదారులకు CMR) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను బాధిత కుటుంబాలకి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరం అని అన్నారు. దీన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలోనాయకులు సంజీవ రెడ్డి, అక్తర్, శ్రీనివాస్, పోతుల రాజేందర్, కాశినాథ్ యాదవ్, MD ఇబ్రహీం, అష్రాఫ్, అనిల్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.