- నాగప్రియ మృతిపై వచ్చిన వార్తలను ఖండించిన యాజమాన్యం
శేరిలింగంపల్లి, నవంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): వైద్యంలో నమ్మకమే ముఖ్యమని కొందరి తప్పుడు ప్రచారాల వల్ల మెడికల్ వ్యవస్థపై జనాలకు నమ్మకం పోతుందని, అలాంటి ప్రచారం సరైనది కాదని మెడికవర్ వైద్యులు ఖండించారు. లివర్ డ్యామేజ్, ఆర్గాన్స్ ఫెయిల్యూర్ తోనే నాగ ప్రియ మృతి చెందిందని అన్నారు. డబ్బు కోసం ఠాగూర్ సినిమా తరహా హాస్పిటల్ సంఘటన అంటూ వచ్చిన దుష్ప్రచారాన్ని మెడికవర్ హాస్పిటల్స్ తీవ్రంగా ఖండించింది. వైద్యసేవలను నిర్వీర్యం చేసేలా వచ్చిన వార్తలను మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు గురువారం విలేకరుల సమావేశంలో హాస్పిటల్ వైద్యులు మాట్లాడుతూ.. మాదాపూర్ మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన జూనియర్ డాక్టర్ నాగ ప్రియ (28) మృతిపై వివరణ ఇచ్చారు.
ఠాగూర్ సినిమాను తలపించేలా మెడికవర్ ఆస్పత్రిలో డెడ్ బాడీ కి చికిత్స, బాధితుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని మృతదేహాన్ని అప్పగించారంటూ పలు మీడియాలో వచ్చిన కథనాలను మెడికవర్ వైద్యులు, మేనేజ్మెంట్ ఖండించారు. నాగ ప్రియ ఫుడ్ పాయిజన్ తో ఆమెకు దగ్గరలోని ఆస్పత్రిలో చికిత్స పొందారని, అక్కడ ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఓ పెద్ద ఆస్పత్రికి తరలించారని అన్నారు. అక్కడి నుండి ఓ వైద్యుడి రిఫరెన్స్ ద్వారా తమ వద్దకు వచ్చారని, అప్పటికే ఆమె పరిస్థితి క్రిటికల్ గా ఉందని, ఆమె బ్రతికేందుకు కేవలం 20 శాతం మాత్రమే ఛాన్స్ ఉందని తెలిపారు.
అయితే వైద్యులుగా ప్రతి పేషేంట్ ను బతికించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని అందులో భాగంగానే నాగలక్ష్మి ని జాయిన్ చేసుకున్నామని డాక్టర్లు వెల్లడించారు. ఆమె పరిస్థితిపై వారి కుటుంబ సభ్యులతో మాట్లాడామని ఆమెకు ప్లాస్మా ఛేంజ్ చేయాల్సి ఉందని వారికి చెప్పామన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాతనే ఆమెకు సరైన వైద్యం అందించామన్నారు. కానీ అప్పటికే ఆమె లివర్ ఫంక్షన్ పాడైందని, అలాగే మల్టీ ఫుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయని అందువల్లనే ఆమె మృతి చెందారని అన్నారు. అయితే తాము డబ్బుల కోసం పేషేంట్స్ బంధువులను ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదని, అలాగే చనిపోయాక ఆమెకు ఎలాంటి వైద్యం అందించలేదని మెడికవర్ వైద్యులు స్పష్టం చేశారు. కానీ కొందరు కావాలనే ఠాగూర్ సిండ్రోమ్ ను సృష్టించి తమపై ఆపాదిస్తున్నారని మండిపడ్డారు.
వైద్యంలో నమ్మకమే ముఖ్యమని, డాక్టర్లపై నమ్మకం ఉంటేనే పేషెంట్‌ను బాగుచేయగలమన్నారు. ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల డాక్టర్లు సరైన ప్రాక్టీస్ చేయలేరని అన్నారు. కొందరి వల్ల మెడికల్ వ్యవస్థపై జనాలకు నమ్మకం పోతుందని, అలాంటి ప్రచారం సరైనది కాదని మెడికవర్ వైద్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శరత్ రెడ్డి, డాక్టర్ సతీష్ కైలాశం, డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, డాక్టర్ ఉమాపతి, డాక్టర్ మితిలేష్ తదితరులు పాల్గొన్నారు.