సూపర్వైజ‌ర్లు, ఎన్యుమరేటర్లకు మెటీరియల్ పంపిణీ

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) లో భాగంగా చందానగర్ సర్కిల్ లోని Dr.BR అంబేద్కర్ కళ్యాణ మండపంలో సుపర్ వైజ‌ర్లు, ఎన్యుమరేటర్లకు నియామక పత్రాలు, సర్వే మెటీరియల్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పి.మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఇంటింటి సర్వే కార్యక్రమానికి కేటాయించించబడిన ఎన్యుమరేటర్ లు, సూపర్వైజర్ లు బుధ‌వారం నుండి క్షేత్ర స్థాయిలో కుటుంబాలను గుర్తించి వివరాలు నమోదు చేస్తూ ఈ నెల 6 నుండి 19 తేదీ వరకు 14 రోజుల్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ స‌ర్వేను రెండు విడతల్లో చేయాలని, మొదటి విడతలో తమకు కేటాయించిన కుటుంబాలను గుర్తించి ఇంటి నంబరు వగైరా వివరాలను నమోదు చేసుకుని వారి ఇంటికి స్టిక్కర్ ను అతికించాలని, రెండవ విడతలో కుటుంబ సభ్యుల అందరి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులము వివరాల‌ను జాగ్రత్తగా మార్గదర్శక పుస్తకంలో సూచించిన ప్రకారం పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని అన్నారు.

మెటీరియ‌ల్‌ను పంపిణీ చేస్తున్న దృశ్యం

ప్ర‌తి రోజు సంబధిత సూపర్వైజ‌ర్లు పది శాతం ఎన్య్యూమరేటర్ల నమోదును క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి ఎన్యుమరేటర్లకు తగు మార్గదర్శకత్వం చేయాలని డిప్యూటీ కమిషనర్ ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు, కాలనీ సంఘాలు మొదలైన వారు సర్వే సిబ్బందికి సహకరించి సమాచారం ఇవ్వాలని డిప్యూటీ కమిషనర్ ఈ సందర్భం గా కోరారు. ఈ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో సర్కిల్ ACP నాగిరెడ్డి, ప్రాజెక్టు అధికారిణి ఉషా రాణి, DE లు స్రవంతి, దుర్గా ప్రసాద్, AE లు ప్రతాప్, ప్రశాంత్, సంతోష్ రెడ్డి, వార్డు ఇంచార్జి AMC లు విజయకుమార్, కృష్ణ, నాగరాజు, గిరి, పారిశుద్య అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here