భావిత‌రాల‌కు డ‌బ్బు కాదు, ఆరోగ్యం అందించాలి: ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మన భవిష్యత్తు తరాలకు ఆస్తులు కాదు మంచి ఆరోగ్యం, ప్రశాంత జీవితం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంద‌ని PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని కిందికుంట పార్క్ లో భాగ్య నగర్ గ్యాస్ లిమిటెడ్ ఆర్థిక సహాయంతో CSR ఫండ్ రూ. 15 లక్షల 35 వేల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను, పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆటసామ‌గ్రిని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాంమోహన్ రావు, డైరెక్టర్ కమర్షియల్ దనుతల‌తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ కిందికుంట పార్క్ లో జిమ్ ప్రారంభం కావ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఇందుకు గాను భాగ్య న‌గ‌ర్ గ్యాస్ లిమిటెడ్‌ను అభినందిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌జ‌లు ఈ స‌దుపాయాల‌ను ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు.

జిమ్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

వివేకానంద‌న‌గ‌ర్‌లో..

వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని బాగ్ అమీర్ GV హైట్స్ లో భాగ్య నగర్ గ్యాస్ లిమిటెడ్ ఆర్థిక సహాయంతో CSR ఫండ్ రూ. 15 ల‌క్ష‌ల‌ 35 వేల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను, పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆటసామ‌గ్రి పరికరాల‌ను కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి రంగారావు, నార్నె శ్రీనివాసరావు, భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాంమోహన్ రావు, డైరెక్టర్ కమర్షియల్ ల‌తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంజీవ రెడ్డి, మాధవరం రామారావు, నాయినేని చంద్రకాంత్ రావు, రాంచందర్, హరినాథ్, MD ఇబ్రహీం, అల్లం మహేష్, లింగయ్య, నర్సయ్య, క్రాంతి, జగదీష్, రాధాబాయి, భారతమ్మ, విజయలక్ష్మి పాల్గొన్నారు.

పార్కులోని పిల్ల‌ల ఆట వ‌స్తువుల‌ను ప‌రిశీలిస్తున్న గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here