శేరిలింగంపల్లి, అక్టోబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ రవీందర్ నాయక్ కొండాపూర్ జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి జ్వరపీడితులు, అడ్మిషన్లు, కొనసాగుతున్న చికిత్సలు, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మందులు, మౌలిక సదుపాయాలు, ఆసుపత్రికి ఏవైనా సివిల్ వర్క్‌ల అవసరాలపై ఆరా తీశారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనురాగిణి రెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ చంద్రకృష్ణ, హాస్పిటల్ సిబ్బందిని కలిసి మాట్లాడారు.