శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని మాధవరం కాలనీలో శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని శోభా యాత్ర పూజ కార్యక్రమంలో PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్, రవీందర్ రావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం, బీసీ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు తెల్ల హరికృష్ణ, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, MD ఇబ్రహీం, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
పాపిరెడ్డి కాలనీలో..
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్, రవీందర్ రావు, రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నరేందర్ బల్లా, ప్రవీణ్, సందీప్ రెడ్డి, బసవయ్య పాల్గొన్నారు.