మియాపూర్, సెప్టెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ విలేజ్ లోని వడ్డెర బస్తీ వెంకటేశ్వర్ నగర్ లో మియాపూర్ వడ్డెర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సిద్ధి వినాయక ఉత్సవ గణనాధుని నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కొలువైన గణపయ్య లడ్డూ ప్రసాదం వేలంపాటలో ఎత్తరి పూజారి గిరయ్య రూ.1,67,001 కు లడ్డూను కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ గ్రామం పెద్దలు, చుట్టుపక్కల కాలనీ వాసులు, ఇతర కమిటీ సభ్యులు, గణనాథుని ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.