మాదాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్‌లోని నోవాటెల్ హెచ్ఐసీసీలో గురువారం హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజ్ అసోసియేషన్ (హైసియా) 28వ వార్షిక ఇన్నొవేషన్ సమ్మిట్, అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పలువురికి అవార్డులను అందజేశారు. యూఐడీఏఐ మాజీ చైర్మన్ జె.సత్యనారాయణకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేశారు. అలాగే కోవిడ్ లాక్డౌన్ సమయంలో విశేష సేవలను అందించినందుకు గాను సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌కు కేటీఆర్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో.. కోవిడ్ అనంతరం పారిశ్రామిక రంగంలో నెలకొన్న మార్పులు, నూతన తరహా బిజినెస్ మోడల్స్ సృష్టి, భవిష్యత్తుపై టెక్నాలజీ ప్రభావం, భవిష్యత్తులో పనివిధానం, నైపుణ్యాలు, నాయకత్వం కొనసాగించడం.. వంటి అంశాలపై పలువురు ప్రముఖులు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీఈ అండ్ సీ డెవలప్మెంట్ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎస్టీపీఐ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఓంకార్ రాయ్, ఇన్ఫోసిస్ లిమిటెడ్ సీవోవో యూబీ ప్రవీణ్ రావు, టెక్ మహీంద్రా లిమిటెడ్ సీఈవో అండ్ ఎండీ సీపీ గుర్ణాని, బాన్ కార్పొరేషన్ అండ్ కార్డిస్ వ్యవస్థాపకుడు జాన్ బాన్, యాక్సిస్ బ్యాంక్ ఈడీ రాజీవ్ ఆనంద్, డెలాయిట్ ఏపీఏసీ ఫ్యూచర్ ఆఫ్ వర్క్ లీడర్ నికోల్ స్కోబుల్ విలియమ్స్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ లిమిటెడ్ సీవోవో, ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ నచికెత్ దేష్పాండే, భారత్ బయోటెక్ చైర్మన్ అండ్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, డీబీఎస్ ఆసియా హబ్ 2 సీఈవో అలెక్స్ యూ మెంగ్ వూ, సీబీఆర్ఈ ఏపీఏసీ ఇన్వెస్టర్ థాట్ లీడర్షిప్ హెడ్ ఆఫ్ రీసెర్చ్ గ్లోబల్ హెడ్ డాక్టర్ హెన్రీ చిన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీటీవో బి.కల్యాణ్ కుమార్, మైక్రాన్ టెక్నాలజీ ఇండియా ఎండీ ఆనంద్ రామమూర్తి, టెక్ మహీంద్రా సీపీవో హర్షవేంద్ర సోయిన్, టి.హబ్ సీఈవో రావి నారాయణన్, టీఎస్టీఎస్ ఎండీ జీటీ వెంకటేశ్వర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ఐటీఈ అండ్ సి డిపార్ట్మెంట్ సీఆర్వో అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు.