నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో గాంధీ శిల్ప బజార్ నేషనల్ సంక్రాంతి సంబరాల సందర్భంగా వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన హస్తకళా ఉత్పత్తులు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నవి. ట్రైబల్ పెయింటింగ్ , బ్లాక్ ప్రింటెడ్ సారీస్, పెయింటెడ్ సారీస్, బ్లాక్ మెటల్ క్రాఫ్ట్స్, ఇత్తడి మెటల్ క్రాఫ్ట్స్, బిద్రీ, సిల్వర్ ఫిలిగురి, జ్యువలరీ, లక్క బ్యాంగిల్స్, జ్యూట్ ప్రొడక్ట్స్, చెక్క బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, వెదురు బుట్టలు, టెర్రకోట, బ్లూ పాటరి , మరెన్నో ఉత్పత్తులు కొలువుదీరాయి.

అంతేకాక సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా నాట్యకల్ప కూచిపూడి డాన్స్ అకాడమీ లక్ష్మి ప్రసూనా శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ఎంతగానో ఆకర్షించింది. తాండవ నృత్య కరి గజానన, నటేశ కౌతం, కోలాటం, కీర్తింతు, జతిస్వరం, బొమ్మ బొమ్మ, శివాష్టకం, మరకత మణి మాయ, ఫ్యూషన్, తిల్లాన, జగదానంద కారక, మంగళం మొదలైన అంశాలను స్వాతి, చైత్ర, హేతుక, జెస్విత, శ్రీ సహస్ర, సంయుక్త, శ్రీశ, మహిక, మహాసవి, రియంశు మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.






