బీసీలంతా ఐక్యమై హక్కుల సాధన దిశగా పయనించాలి

  • అఖిలభారత యాదవ మహాసభ రాయదుర్గం యాదవ సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరించిన బేరి రామచందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : బీసీలంతా ఐక్యమై రాజ్యాధికారం దిశగా, హక్కులు సాధించుకునే దిశగా సాగాలని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ పిలుపునిచ్చారు. రాయదుర్గం యాదవ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ .. ఈ సంవత్సరం దేశ ప్రజలందరికీ మంచి జరగాలని, అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని అన్నారు. రాయదుర్గం యాదవ సంఘం శేరిలింగంపల్లిలో ఆదర్శంగా నిలిచిందని, సంఘంలో ప్రతి ఒక్కరు అంజిమాన్ చిట్టి ప్రతినెల నిర్వహించి ఐక్యతకు చాటుతున్నారని, యాదవ అభివృద్ధి కోసం యాదవ్ సంఘం కృషి చేస్తుందని తెలిపారు.

అఖిలభారత యాదవ మహాసభ రాయదుర్గం యాదవ సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న బేరి రామచందర్ యాదవ్

యాదవ్ సంఘం అధ్యక్షుడు అప్పల కృష్ణ యాదవ్ తండ్రి పేరిట సుమారుగా 3 లక్షల రూపాయల టెంట్ హౌస్ సామాను, యాదవులకు, అన్ని వెనుకబడిన కులాలందరికి ఫ్రీగా టెంట్ హౌస్ సామాన్లు అన్ని శుభకార్యాలకు ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. సంఘం సభ్యులకు, నిరుపేదలకు ఎవరికైనా సమస్య వచ్చినా సంఘం అన్ని విధాల వారికి కృషి చేస్తుందన్నారు. సంఘం సభ్యులందరూ ఐకమత్యంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం పట్ల సంఘం సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం యాదవ సంఘం అధ్యక్షులు అప్పాల కృష్ణ యాదవ్, ఉపాధ్యక్షులు అల్లాడి యాదయ్య యాదవ్, నాగపురి కృష్ణ యాదవ్, గోదా సుధాకర్ యాదవ్, మెట్టు ప్రవీణ్ యాదవ్, నాగపురి అశోక్ యాదవ్, నాగపురి మహేష్ యాదవ్, బండ ప్రవీణ్ యాదవ్, దానబోయిన సాయికిరణ్ యాదవ్, అత్తెన రాజేష్ యాదవ్, బండ ప్రభాకర్ యాదవ్, అందెల సత్యనారాయణ యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here