- పెద్ద ఎత్తున పాల్గొన్న బిజెపి శ్రేణులు, అభిమానులు , కార్యకర్తలు
- వేడుకగా నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవి కుమార్ యాదవ్ సమక్షంలో కేక్ కటింగ్
నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ మసీదు బండ పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, శేరిలింగంపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు భిక్షపతి యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తన జన్మదిన కార్యక్రమాన్ని నాయకుల , కార్యకర్తల అభిమానుల మధ్య నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవి కుమార్ యాదవ్ సమక్షంలో ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ పలు డివిజన్ల నుండి డివిజన్ అధ్యక్షులు, నియోజకవర్గ కన్వీనర్, జిల్లా ,రాష్ట్ర నాయకులు ,కంటెస్టెంట్ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, మహిళా మోర్చా ,యువ మోర్చా, శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి గజమాల , శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా బిక్షపతి యాదవ్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న లేకున్నా తన పై చూపిస్తున్న ఆదరణ, అభిమానాలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కార్యకర్తల ,అభిమానుల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని తెలిపారు.





