నమస్తే శేరిలింగంపల్లి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని నీలిమ హైట్స్, హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఇంజినీర్స్ ఎన్ క్లేవ్ 2 లో మహిళలకు ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రతి కాలనీకి ప్రథమ, ద్వితీయ, తృతీయ, ఐదు కన్సొలేషన్ ప్రోత్సాహక బహుమతులు విజేతలకు అందజేసిన అనంతరం కొమిరిశెట్టి ఫౌండేషన్ ఛైర్మన్ కొమిరిశెట్టి సాయిబాబా, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడారు.

ప్రస్తుత తరుణంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తు తరానికి అందించడానికి, మహిళలలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయడానికి పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా తాటిచర్ల వరలక్ష్మి వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్ యాదవ్, సీతారాం, స్థానిక మహిళా నాయకురాళ్ళు దుర్గ, మౌనిక, అనూష, మాధవి, మానస పాల్గొన్నారు.





