- 20 ఓవర్లలో 211 పరుగులు చేసిన టీఎస్‌సీఎస్ క్రికెట్ క్లబ్
- 75 పరుగులు చేసి 4 వికెట్లు తీసిన కిషోర్
- 51పరుగులతో రిటైర్డ్ హర్ట్గ్ గా నిలిచిన రంజిత్ కుమార్
- లక్షం ముంగిట చతికిలపడిన కమర్షియల్ టాక్స్ క్రికెట్ క్లబ్
- 130 పరుగులకే ఆలౌట్, రాణించిన రాజు (39)
నమస్తే శేరిలింగంపల్లి : అంబర్ పేట్ వాటర్ గ్రౌండ్ లో టీఎస్‌సీఎస్ క్రికెట్ క్లబ్, కమర్షియల్ టాక్స్ క్రికెట్ క్లబ్ మధ్య తలపెట్టిన క్రికెట్ మ్యాచ్ రసవత్తరంగా జరిగింది. టీఎస్ సివిల్ సర్వీసెస్ టాస్ గెలుచుకుని మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ బరిలో దిగిన టీఎస్సీఎస్ 20 ఓవర్లలో 211 పరుగులు చేసింది. అయితే మొదట బ్యాటింగ్ దిగిన టీఎస్‌సీఎస్ ఊచకోత మొదలెట్టింది. ఆట మొత్తం కిషోర్ హావానే కనిపించింది.

అతడికి రంజిత్ కుమార్ తోడవడంతో ప్రత్యర్థిని పరేషాన్ చేశారు. వీరిద్దరూ (కిషోర్ 75పరుగులు, రంజిత్ కుమార్ 51 రిటైర్డ్ హర్ట్) కలిసి భారీ లక్షాన్ని ముందుంచారు. ఇక 212 పరుగులు చేధించేందుకు బరిలో దిగిన కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ భారీ స్కోర్ ఎదుట చతికిలపడింది.

బౌలింగ్ విభాగంలోనూ కిషోర్ (4 వికెట్లు) విజృంభించడంతో 10 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసి ఓటమి పాలైంది. రాజు 39 రన్లను స్కోరు చేశాడు. ఈ విజయంపై సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాధవరం నరేందర్ రావు, జనరల్ సెక్రెటరీ షేక్ యూసుఫ్ మియా, క్లబ్ సెక్రటరీ స్వర్ణరాజ్ హర్షం వ్యక్తం చేశారు.





