శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామికి విశేష పూజలు

  • పాల్గొని అన్నప్రసాద వితరనచేయించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ విశేష పుష్పాలంకారం, నిత్య అర్చనలు తదనంతరం 5. 30 నుండి అర్చనలు భక్తుల హరతి తీర్థ ప్రసాదాలు నిర్వహించారు.

వేంకటేశ్వర స్వామికి పూజలు చేస్తూ..

తదనంతరం స్వామి వారిని మనసా వాచా నమ్మిన భక్తులకు వారి మనోభీష్టాలు నెరవేరిన శుభసందర్భంగా స్వామి అమ్మవార్లకు ఉదయం 10.00 గం లకు ఉచ్ఛవమూర్తులకు పంచామృతఅభిషేకం, శాంతికళ్యాణం, శ్రీ పుష్పయాగం,విశేష హోమం చేయించారు. మధ్యాహ్నం 1 నుండి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నప్రసాద వితరణ చేయించారు.

పాల్గొన్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యవర్గ సభ్యులు దేవాలయ సేవాసమితి, అశేష భక్తులు పాల్గొని హారతి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here