- శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మియాపూర్ లోని మయూరినగర్ లొ ఏర్పాటు చేసిన కేంద్రాల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ పర్యటించి దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలందరూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని, ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీల పథకాలు అర్హులైన పేద ప్రజలకు అందించే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కృష్ణముదిరాజ్, నాగేశ్వరరావు, జి.వి.రెడ్డి, మనెపల్లి సాంబశివరావు, నరేందర్ గౌడ్, శేఖర్ ముదిరాజ్, నడిమిట్టి కృష్ణ, ప్రసాద్, కాలనీ అధ్యక్షులు నారాయణ రావు, ప్రతాప్ రెడ్డి, రామ రాజు, మధుసూదన్ రావు, రంగా రావు, వెంకట్రామిరెడ్డి, సాంబశివరావు, రమేష్, అమర్, వెంకటేష్ పాల్గొన్నారు.






