ఫ్రెండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

నమస్తే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధి సఫారి నగర్ లో న్యూ బ్లూమ్ హైస్కూల్ వద్ద హోలిస్టిక్ హాస్పటల్, కొండాపూర్ (మసీద్ బండ) సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

న్యూ బ్లూమ్ హైస్కూల్ వద్ద నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్న కాలనీవాసులు

శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం డాక్టర్ నజియా జనరల్ ఫిజిషియన్, మాధవి ఆఫ్తమాలజిస్ట్ తదితరులు మాట్లాడారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, నిత్యం వ్యాయామం, పౌష్టికాహారం తీసుకుంటూ ఉండాలని సూచించారు. ఈ శిబిరంలో ఎత్తు, బరువు, రక్తపోటు, షుగర్, పల్స్, కంటి పరీక్షలతో పాటు ఈ.సీ.జీ. మొదలగు పరీక్షలు నిర్వహించగా.. 105 మంది వరకూ పాల్గొని వైద్య సేవలు పొందారు.  ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ కిరణ్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణు ప్రసాద్, జిల్ మల్లేష్, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకుడు ఎండీ. జాఫర్ మియా, హాస్పిటల్ ప్రతినిధులు మాలినీదేవి, శివ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here