- సందడి చేసిన చిన్నారి విద్యార్థినీ, విద్యార్థులు
నమస్తే శేరిలింగంపల్లి : బౌరంపేటలోని గీతాంజలి ఇంటర్నేషనల్ స్కూల్‌లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా స్కూల్ లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థినీ, విద్యార్థులు పలు సాంప్రదాయబద్దంగా తయారై భోగి మంటలు, ప్రార్థన పాట తదితర కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతేకాక తమకు ఇష్టమైన పాటల ట్యూన్‌లకు అనుగుణంగా నృత్యం చేసి సందడి చేశారు.
అనంతరం ప్రిన్సిపాల్ గాయత్రి మాట్లాడుతూ ఉన్నతంగా ఎదగాలంటే.. ప్రతి పనిలో విజయవంతం కావాలంటే తమ లక్ష్యాలను నిత్యం గుర్తుపెట్టుకోవాలని, ఆ దిశగా పేపర్‌లో సెట్ చేసుకోవాలని చెప్పారు. పిల్లలకు ఒక చెడ్డ అలవాటును కాగితంపై రాసి, ఆచారబద్ధంగా సరదాగా కనిపించే భోగి మంటలో విసిరే అవకాశం కల్పించారు. పాఠశాలలో మదురమైన చిరస్మరణీయమైన జ్ఞాపకాల కోసం ఫొటోలు దిగడంతోపాటు రుచికరమైన కేక్, రుచికరమైన వంటకాలను ఆస్వాదించారు.