నమస్తే శేరిలింగంపల్లి : ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా ఆరెకపూడి గాంధీని మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, అభిమానులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వివేకానంద నగర్ లోని ఆరెకపూడి గాంధీ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాంబశివరావు, చిన్న మధుసూదన్ రెడ్డి, మామడిల రాజు, రాజయ్య, కార్యకర్తలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా శేరిలింగంపల్లి నియోజవర్గాన్ని మరింతగా అభిృద్ధిచేస్తానని తెలిపారు.