నమస్తే శేరిలింగంపల్లి : స్థానిక నియోజకవర్గంలోని చెరువుల సుందరీకరణకు కృషిచేస్తున్నామని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ చెరువు వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులను పరిశీలించి మాట్లాడారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులు చేపడుతున్నామని , చెరువులో కలుషిత నీరు కలవకుండా చేపడుతున్న డ్రైనేజి వ్యవస్థ మల్లింపు పనులు వేగం పెంచాలని, చెరువు కట్ట పునరుద్ధరణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే గాంధీ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, సాయివైభవ్ కాలనీ వాసులు పద్మ, అశోక్ రాజు, సత్యనారాయణ, రాజశేఖర్, శ్రీనివాస్, కాలనీవాసులు పాల్గొన్నారు.