నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని గఫుర్ నగర్ కి చెందిన వెంకట నాగ సుజాత సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా సీఎం ఆర్ ఎఫ్ నుంచి రూ. 2 లక్షల 50 వేలు మంజూరయ్యాయి. ఈ ఆర్ధిక సహాయానికి సంబంధించిన సీఎం ఆర్ ఎఫ్ ఎల్ ఓసి మంజూరి పత్రాన్ని హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి బాధిత కుటుంబానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందచేశారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం నిరుపేదలకు సేవలు అందిస్తున్నదని తెలిపారు. వైద్య చికిత్స కి సహకారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ లకు బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అబీబ్ బాయ్ , అష్రాఫ్ పాల్గొన్నారు.





