- పార్టీ బలోపేతంపై చర్చ.. ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని హామీ
నమస్తే శేరిలింగంపల్లి: బిఆర్‌ఎస్ పార్టీ విజయఢంకా మోగించేలా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ కోరారు. బుధవారం సాయంత్రం మాదాపూర్ డివిజన్ లోని శేరిలింగంపల్లి మాదాపూర్ డివిజన్ మాదాపూర్ గ్రామం సహదేవ్ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ బలోపేతంపై చర్చించారు. కొత్తవారిని పార్టీలో చేర్చుకోవడం, సంప్రదింపులు జరపాల్సిన విషయాలపై కూలంకషంగా చర్చించారు. కార్యకర్తలకు ఏ కష్టం రాకుండా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బండి రమేష్ గారితో పాటు పార్టీ నాయకులు జి సంగారెడ్డి, నర్సింగ్ రావు, శేఖర్ గౌడ్, అరుణ, షరీఫ్, వెంకటరమణ, రవీందర్ రావు, మరియు అనేక మంది యువత పాల్గొనడం జరిగింది.