- నివాళులర్పించిన బిఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్
నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మరణంపై బి ఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్తన సంతాపం తెలిపారు. సాయిచంద్ మరణం తనని దిగ్భ్రాంతికి గురిచేసిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తెలంగాణ సమాజానికి ముఖ్యంగా బిఆర్ ఎస్ కి తన గొంతుక ద్వారా ఎనలేని సేవలు చేసిన సాయిచంద్ మరణం తీరని లోటు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో పాట ఉన్నన్ని రోజులు సాయిచంద్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు.
రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా రక్త బంధం విలువ నీకు తెలువదు అనే పాటతో తెలంగాణ ఆడపడుచులను, అమ్మలను మేల్కొలిపారని, తెలంగాణ మొట్ట మొదటి విద్యార్థి అమరవీరుడు స్వర్గీయ శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, అమరవీరుల కుటుంబాల గుండెలను కరిగించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర కళాకారుడు సాయిచందు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఈ సందర్బంగా సాయి చందు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నివాళులర్పించిన వారిలో శేరిలింగంపల్లి ఉద్యమ నేతలు మల్లికార్జున శర్మ, సంగారెడ్డి, శేఖర్ గౌడ్, సత్య రెడ్డి, టీ బాలరాజ్ ముదిరాజ్, సాయి, నర్సింగరావు, ముక్తార్, సంజయ్ కుమార్, మాజీద్ భాయ్, జి సంగారెడ్డి, తెప్ప బాలరాజు ముదిరాజ్, షరీఫ్, మనీష్ కుమార్, వెంకటరమణ, రవీందర్ రావు, బిఆర్ యువసేన పాల్గొన్నారు.