చిన్న అంజయ్య నగర్ లో వ‌ర‌ద స‌హాయం అంద‌జేత

శేరిలింగంపల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో ముంపునకు గురైన ఇండ్లను గుర్తించి వారికి ఆర్థిక సహాయం అందజేసే ప్రక్రియ రెండో రోజు స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో కొనసాగింది. గురువారం డివిజన్ పరిధిలోని చిన్న అంజయ్య నగర్ లో వరద ముంపు‌ ఒక్కో బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిన రూ. 10 వేల తక్షణ‌ ఆర్థిక సహాయాన్ని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అందజేశారు.

చిన్న అంజయ్య నగర్ లో వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయం అంద‌జేస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సాయం పట్ల ముంపు బాధితుల్లో అభిమానం నెలకొని ఉందన్నారు. పేదల గుండెల్లో సీఎం కేసీఆర్ చిరస్థాయిగా నిలుస్తారన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కేసీఆర్ సారథ్యంలో‌ టీఆర్ఎస్ సర్కార్ అండగా నిలిచి ఆదుకుంటుందని రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు విశాల్, లక్ష్మీనారాయణ, కృష్ణ, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షుడు పద్మారావు, అంజయ్య నగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు బాబర్, నాయకుడు రవి నాయక్ పాల్గొన్నారు.

చిన్న అంజయ్య నగర్ లో వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయం అంద‌జేస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here