- కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్
మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేస్తుందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్, ఖానామెట్ ముస్లిం బస్తీలలో వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేల సహాయాన్ని ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద బాధితులకు సీఎం కేసీఆర్ అండగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ ప్రశాంత్, రెవెన్యూ అధికారులు ఆనంద్, రాజశేఖర్, నాయకులు సార్వార్, శ్యామ్, షకీల్, షైబజ్, మున్నా, ప్రసాద్ పాల్గొన్నారు.