ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీకి ప‌ట్ట‌భ‌ద్ర ఓట‌ర్ న‌మోదు ప‌త్రాల అంద‌జేత

హైద‌ర్‌న‌గ‌ర్/శేరిలింగంపల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెరాస పార్టీ‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రివర్యులు కేటీఆర్ ‌ ఆదేశాల మేరకు రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఆన్ లైన్ లో నమోదు చేసిన 100 మంది పట్టభద్రుల ఓటర్ నమోదు వివరాలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి హైదర్ నగర్ డివిజన్ తెరాస సీనియర్ నాయకుడు దామోదర్ రెడ్డి గురువారం అంద‌జేశారు.

ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీకి ప‌ట్ట‌భ‌ద్ర ఓట‌ర్ న‌మోదు ప‌త్రాలను అంద‌జేస్తున్న దామోదర్ రెడ్డి

మార‌బోయిన రాజు యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో…

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా 100 మంది పట్టభద్రుల ఓటర్ నమోదు వివరాలను శేరిలింగంపల్లి డివిజన్ తెరాస అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్ ఆధ్వ‌ర్యంలో సెంట్రల్ పార్క్ – 2 ప్రెసిడెంట్ శ్రీరామనేని రమణి గురువారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు లక్ష్మారెడ్డి, సెంట్రల్ పార్క్ – 2 అసోసియేషన్ సభ్యులు సురేష్, రామకృష్ణ, వేణు పాల్గొన్నారు.

మార‌బోయిన రాజు యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో ఆరెక‌పూడి గాంధీకి ఓట‌ర్ న‌మోదు ప‌త్రాలను అంద‌జేస్తున్న శ్రీరామనేని రమణి

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. రానున్న ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు గాను ప‌ట్ట‌భ‌ద్రులంద‌రూ ఓట‌ర్లుగా న‌మోదు చేయించుకుని ఎన్నిక‌ల్లో ఓటు వేయాల‌ని అన్నారు. 2017 క‌న్నా ముందు డిగ్రీ, ఇంజినీరింగ్ లేదా అందుకు స‌మానమైన డిప్లొమా పూర్తి చేసిన వారు ప‌ట్ట‌భద్ర ఓట‌ర్లుగా న‌మోదు చేయించుకోవ‌చ్చ‌ని తెలిపారు. అందుకు గాను డిగ్రీ లేదా డిప్లొమా స‌ర్టిఫికెట్‌, ఆధార్ కార్డు, ఓట‌ర్ ఐడీ కార్డు జిరాక్స్ కాప‌లీలు, 2 పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, ఓటీపీ కోసం మొబైల్ నంబ‌ర్ అవ‌స‌రం అవుతాయ‌ని అన్నారు. అన్ని వివ‌రాల‌ను నింపి పూర్తి చేసిన ఫాం 18 ప‌త్రాల‌ను స‌మీపంలోని త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో అంద‌జేయ‌వ‌చ్చ‌న్నారు. లేదా ఆన్‌లైన్‌లోనూ ప‌ట్ట‌భ‌ద్ర ఓట‌ర్‌గా న‌మోదు చేయించుకోవ‌చ్చ‌ని తెలిపారు. ఈ ఓట‌ర్ న‌మోదు ప్ర‌క్రియ న‌వంబ‌ర్ 6వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here