- సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, పనులలో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. జాతీయ రహదారి ఎన్ హెచ్ 65 ప్రధాన రహదారి పై భేల్ చౌరస్తాలో రూ. 130.65 కోట్ల అంచనావ్యయం తో చేపడుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణం పనుల స్థితిగతుల పై సంబంధిత ఆర్ & బి అధికారులతో మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ సర్వీస్ రోడ్డు లో పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అప్రోచ్ రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని, సర్వీస్ రోడ్డు లో తీసిన గోతుల చుట్టూ రక్షణ వలయాలను ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.
ప్రమాదాల నివారణ కై రక్షణ వలయాలు ఏర్పాట్లు చేయాలని, ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా అన్ని రకాల రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఆర్ & బీ డీఈ రామకృష్ణ, చందానగర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ నాయకులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాత్రి గౌడ్, సత్యనారాయణ, నరేందర్ పాల్గొన్నారు.