నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో ఎథ్నిచ్ హాల్ లో సంగీతనాటక అకాడమీ అవార్దీ నాట్యాచార్యులు పండిట్ రాజేంద్ర గంగాని, ఆర్తిశాఖేర్ ఆధ్వర్యంలో కథక్ నృత్య వర్క్ షాప్ నిర్వహించారు. మూడు రోజుల ఈ కథక్ నృత్య వర్క్ షాప్ లో దాదాపుగా అరవై మంది కథక్ కళాకారులు పాల్గొని గురువర్యులు దగ్గర కథక్ నృత్యం లో మెళకువలను నేర్చుకుంటున్నారు. నర్తకి నృత్య ప్రదర్శనలో పద నర్తనం, హస్త విన్యాసం, అభినయం తాళ లయ గతుల గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఈ తరం కళాకారులకి ప్రాచీన కళ ప్రాముఖ్యత తెలుసుకోవడం, నృత్యంలో మెళకువలు నేర్చుకోవడం లాంటివి ఈ వర్కషాప్ లో నేర్చుకోవడం సంతోషంగా ఉందని కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.