నమస్తే శేరిలింగమపల్లి: లింగంపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థినీ విద్యార్థులకు ఆర్.కే.వై ఫౌండేషన్ చైర్మన్ రవికుమార్ యాదవ్ స్టడీ మెటీరియల్ ను ఆర్.కే.వై టీమ్ సభ్యుల తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఆర్.కే.వై ఫౌండేషన్ ద్వారా ఇంత మంచి కార్యక్రమాలు చేపడుతున్న రవికుమార్ యాదవ్ కి ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులందరూ ఈ స్టడీ మెటీరియల్ తో బాగా ప్రాక్టీస్ చేసి మంచి మార్కులు సాధించాలని, మీ భవిష్యత్తుకు ఇదే పునాది , అందరూ ఉత్తీర్ణులై పాటశాలకు, మీ ఉపాధ్యాయులకు అలాగే మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు భూమయ్య , శైలజ గారు , కాంటేస్టడ్ కార్పొరేటర్ కర్చర్ల ఎల్లేష్ గారు, సోమయ్య యాదవ్ గారు, మాధవి గారు, కిషోర్ గారు, అరుణ్ యాదవ్ గారు,శ్రీకాంత్ యాదవ్ గారు తదితరులు పాల్గొన్నారు.