నమస్తే శేరిలింగంపల్లి: భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు.
మియాపూర్ డివిజన్ పరిధి స్టాలిన్ నగర్ కాలనీలో తలెత్తిన డ్రైనేజీ సమస్యను స్థానిక నాయకులు కాలని వాసులతో కలిసి పరిశీలించారు. పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు డ్రైనేజీ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, వెంకటేష్, రాణి, లత, మొహిన్, శమల,దేవేందర్,నరేష్, సతీష్, గోపి, చిన్న, ప్రసాద్ , కాలని వాసులు, తదితరులు పాల్గొన్నారు.