అన్ని రంగాలలో ప్రావీణ్యం సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: అంతర్జాతీయ మహిళ దినోత్సవంను పురస్కరించుకుని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం ఎంఎస్ ఫంక్షన్ హాల్ లో మాజీ కార్పొరేటర్ సాయి బాబా ఆధ్వర్యంలో మహిళ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మహిళ సోదరిమణులను సన్మానించారు. మహిళ సోదరీమణులందరికి అంతర్జాతీయ మహిళ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.

రాయదుర్గం ఎంఎస్ ఫంక్షన్ హాల్ లో మహిళ దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, మహిళామణులు

మహిళ లు అన్ని రంగాలలో ప్రావీణ్యం సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య వైద్య అధికారి శైలజ, రాయదుర్గం సిఐ మహేష్, ఎస్సై వెంకటేష్, మాదాపూర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళ సోదరీమణులు పాల్గొన్నారు.

మహిళలకు కానుకలు అందజేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here