నమస్తే శేరిలింగంపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఎత్నిక్ హాల్ లో దాదాపుగా 150 మహిళామణులకు మాతృ శక్తి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సంఘసేవకురాలు నడింపల్లి యమునా పథక్, లయన్స్ క్లబ్ మాతృశక్తి సంయుక్త నిర్వహణలో కార్యక్రమాన్ని నిర్వహించగా.. ప్రముఖ గాయకులు చైర్మన్ భగవద్గిత ఫౌండేషన్ గంగాధర శాస్త్రి, సంఖ్యా శాస్త్ర నిపుణులు దైవజ్ఞ శర్మ, డాక్టర్ రవికాంత్ విచ్చేసి నిష్ణాతులైన మహిళామణులకు “మాతృ శక్తి అవార్డు ప్రదానం చేశారు.
పద్మశ్రీ శోభా రాజ్ కి, రచయిత జలంధర చంద్రమోహన్ , ఫార్మర్ డిప్యూటీ డైరెక్టర్, మినిస్ట్రీ అఫ్ డిఫెన్స్ మల్లవరపు బాల లతా , సీనియర్ జనలిస్ట్ గాయని స్వప్న, డాక్టర్ లక్ష్మి , ప్రొఫెసర్ రేఖ రావు, డాక్టర్ రాధికా నల్లం, తదితర మహిళామణులను సత్కరించారు.